Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

వినాయక వేడుకలు.. భద్రత పక్కాగా!

Author MANA VISHWAM | 09 Sep 2026, 07:31 PM | వరంగల్
వినాయక వేడుకలు.. భద్రత పక్కాగా!

నల్లబెల్లి, సెప్టెంబర్‌ 9 (మన విశ్వం): వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా నల్లబెల్లి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మండల పరిధిలో గణేష్‌ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు వాటి పూర్తి వివరాలను తెలంగాణ పోలీస్‌ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఎస్సై సాయి ప్రసన్నకుమార్ సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాల కాపీని నల్లబెల్లి పోలీస్‌ స్టేషన్‌లో అందజేయాలని తెలిపారు.
మండపాల వివరాలు ముందుగానే అందితే అవసరమైన బందోబస్తు, నిమజ్జన ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణపై పక్కా ప్రణాళిక రూపొందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. భక్తిశ్రద్ధలతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వేడుకలు నిర్వహించాలని ఎస్సై సూచించారు.