Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఆమె కనులు.. ఇద్దరి జీవితాల్లో వెలుగులు!

Author MANA VISHWAM | 08 Sep 2026, 02:14 PM | వరంగల్
ఆమె కనులు.. ఇద్దరి జీవితాల్లో వెలుగులు!

నర్సంపేట /నల్లబెల్లి, సెప్టెంబర్‌ 8 (మన విశ్వం): ఆమె ఈ లోకాన్ని వీడినా.. ఆమె కనులు మాత్రం మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాయి. మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపునిచ్చిన పిట్టల సిరివెన్నెల సేవాభావం ఆదర్శంగా నిలిచింది. ఆమెను స్మరించుకుంటూ నల్లబెల్లిలో సదాశయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల కుటుంబ సభ్యులు పిట్టల రజిత, రమేశ్‌లను ఘనంగా సన్మానించి వారి మానవతా దృక్పథాన్ని అభినందించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన నల్లబెల్లి ఎస్‌ఐ ఎం.సాయి ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ.. మరణానంతరం ఇతరులకు చూపును అందించడం గొప్ప మానవతా సేవ అన్నారు. నేత్రదానంపై సమాజంలో మరింత అవగాహన పెరగాలని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిరివెన్నెల కుటుంబం చూపిన ధైర్యం, సేవా స్ఫూర్తి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ చల్ల గురువుల చలపతి (దళపతి), హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కె.శంకరరావు, వరంగల్‌ జిల్లా కార్యదర్శి గోవింద్‌ కుమారస్వామి, డా.గాల శ్రీనివాస్‌, ఆకుల సుభాష్‌తో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

ఆమె కనులు.. ఇద్దరి జీవితాల్లో వెలుగులు! - Additional Image