Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

సీపీఆర్‌ చేసిన మంత్రి.. దక్కని ప్రాణం!

Author MANA VISHWAM | 08 Sep 2026, 01:19 PM | హైదరాబాద్
సీపీఆర్‌ చేసిన మంత్రి.. దక్కని ప్రాణం!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (మన విశ్వం): అసెంబ్లీ సమావేశాల వేళ మంగళవారం అనూహ్య విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిట్టల్‌ పర్సనల్‌ సెక్రటరీ రాజు విధుల్లో ఉండగానే అసెంబ్లీ ఆవరణలో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అదే సమయంలో అక్కడున్న మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించారు. రాజును కాపాడేందుకు స్వయంగా సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయత్నం ఫలించలేదు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అప్పటివరకు విధుల్లో ఉన్న రాజు క్షణాల్లోనే కుప్పకూలడం అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంత్రి స్వయంగా సీపీఆర్‌ చేసి కాపాడేందుకు చేసిన ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో విషాదం నెలకొంది. రాజు ఆకస్మిక మృతితో అసెంబ్లీ వర్గాలు, సహచర ఉద్యోగుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాజు మృతికి దారితీసిన ఖచ్చితమైన వైద్య కారణంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

సీపీఆర్‌ చేసిన మంత్రి.. దక్కని ప్రాణం! - Additional Image