Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డికి అంతిమ వీడ్కోలు

Author MANA VISHWAM | 31 Jul 2026, 10:26 PM | Array
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డికి అంతిమ వీడ్కోలు

గౌరవ వందనంతో ఘనంగా అంత్యక్రియలు

నల్లబెల్లిలో విషాద వాతావరణం.. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు

వరంగల్, జూలై 31 (మన విశ్వం): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసి పూర్తి ప్రభుత్వ మర్యాదలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది.
ప్రభుత్వం తరఫున నర్సంపేట ఆర్డీవో ఉమారాణి అంత్యక్రియలకు హాజరై పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు గౌరవ వందనం నిర్వహించి తుది వీడ్కోలు పలికారు.
అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తెలంగాణ ఉద్యమ సహచరులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నల్లబెల్లి గ్రామం శోకసంద్రంగా మారగా, పెద్ది సుదర్శన్ రెడ్డికి అశ్రునయనాలతో ప్రజలు తుది వీడ్కోలు పలికారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను పలువురు స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

ఇవి కూడా చదవండి