పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది

హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలింపు ఏర్పాట్లు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దు: వైద్యులు హనుమకొండ, జూలై 26 (మన విశ్వం): గుండెపోటుకు గురైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. హనుమకొండలోని రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డా. సుధాకర్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, గుండెపోటు లక్షణాలతో పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆస్పత్రికి తీసుకురాగానే అత్యవసర చికిత్స ప్రారంభించామని చెప్పారు. వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, దానికి అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రాథమిక చికిత్స...