Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

మైత్రీవనం అగ్నిప్రమాద ఘటన.. మరోసారి ఆధారాలు సేకరించనున్న క్లూస్ టీమ్

Author MANA VISHWAM | 05 Jun 2026, 11:56 AM | హైదరాబాద్
మైత్రీవనం అగ్నిప్రమాద ఘటన.. మరోసారి ఆధారాలు సేకరించనున్న క్లూస్ టీమ్

హైదరాబాద్, జూన్ 5: మైత్రీవనం కేఎస్‌ఆర్ ఫ్యాషన్స్ బిల్డింగ్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అగ్నిప్రమాద ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్, మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణమా..? మానవ తప్పిదాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రమాదానికి కారణమైన బిల్డింగ్‌కు అనుమతులు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు, ఇతర అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.మెట్రో నిర్మాణం తర్వాత బిల్డింగ్ ఏర్పాటు చేసినట్లు జీఎచ్ఎంసీ గుర్తించింది. మరోసారి నేడు(శుక్రవారం) ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించనుంది. ఈరోజు అమీర్‌పేట్‌లో ప్రమాదానికి గురైన షాపింగ్ కాంప్లెక్స్‌ను నిపుణుల బృందం పరిశీలించనుంది. ప్రమాదంలో కోటిన్నరకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రమాదంలో మొదటి, రెండో అంతస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అగ్నికి ఆహుతైన మొదటి, రెండో ఫ్లోర్లలో 13 కాంప్లెక్స్‌లు ఉండగా.. అందులో హెల్మెట్లు, బొమ్మలు, బట్టల దుకాణాలు ఉన్నాయి.