గ్రూప్-1 మూల్యాంకనంపై న్యాయవిచారణ జరపాలి
గ్రూప్-1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంపై తలెత్తిన వివాదాన్ని నిష్పక్షపాతంగా విచారించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్టింగ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మంగళవారం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యదర్శి హరితకు వినతిపత్రం అందజేశారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందంటూ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షల మూల్యాంకనానికి సంబంధించిన రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని, జవాబు పత్రాలను స్వతంత్ర నిపుణులతో మరోసారి పరిశీలింపజేయాలని నేతలు కోరారు. మూల్యాంకనంలో పొరపాట్లు, అక్రమాలు జరిగాయా అనే...