వెయ్యి గ్రామాలకు చేరిన భూ రీసర్వే!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమం వెయ్యి గ్రామాల మైలురాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భూములకు కచ్చితమైన సరిహద్దులు నిర్ణయించి, ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా రీసర్వేను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో రీసర్వే చేపట్టగా, 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో భూ రీసర్వే పురోగతిపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల స్పందన, సాంకేతిక ఇబ్బందులు, సర్వే సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితులపై చర్చించారు. సర్వేలో పాల్గొంటున్న సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ...