సబ్‌ రిజిస్ట్రార్‌ను కాపాడుతున్నదెవరు?

అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలపై విచారణ పేరుతో కాలయాపన ఎందుకు? డాక్యుమెంట్‌ నంబర్లతో సహా కథనాలు వెలువడినా చర్యలేవీ? జిల్లా రిజిస్ట్రార్‌ నుంచి డీఐజీకి నివేదిక వెళ్లిందా?.. అసలు విషయం ఆయన దృష్టికి చేరిందా? గతంలో రాజేష్‌పై మూడు రోజుల్లోనే వేటు.. వెంకట్‌లాల్‌ విషయంలో మీనమేషాలెందుకు? అధికారిని కాపాడుతున్నారా?.. ఆరోపణలను తేలిగ్గా తీసుకుంటున్నారా? వరంగల్‌, అక్టోబర్‌ 31 (మన విశ్వం): ఖిలా వరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాదాస్పద రిజిస్ట్రేషన్ల వ్యవహారం రోజురోజుకూ మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకట్‌లాల్‌పై అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారుల చర్యల్లో జాప్యం ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకే ఇంటి నంబర్‌తో పలు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు,...