వేటేస్తారా?.. వెనకేసుకొస్తారా?

ఖిలా వరంగల్ ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌కు నోటీసులు ఒకే ఇంటి నంబర్‌తో 12 ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం సాదాబైనామా కేసు, నాలా అనుమతులపై తీవ్ర సందేహాలు ‘మన విశ్వం’ కథనాలతో కదిలిన స్టాంప్స్ &రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపిన జిల్లా రిజిస్ట్రార్ చర్యలు తీసుకుంటారా?.. వివరణతోనే సరిపెడతారా? వరంగల్, అక్టోబర్ 26 (మన విశ్వం): ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాదాస్పద రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఇప్పుడు జిల్లా రిజిస్ట్రార్ నిర్ణయంపై ఉత్కంఠ రేపుతోంది. ఒకే ఇంటి నంబర్‌తో 12 ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిర్వహించారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సాదాబైనామా సంబంధిత పత్రాలు, వ్యవసాయ భూముల వ్యవసాయేతర వినియోగ మార్పిడి (నాలా)...