నేడు కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ!

హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (మన విశ్వం): రాష్ట్ర మంత్రివర్గం నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు పెండింగ్‌ డీఏలు, పీఆర్సీ నివేదిక, పెండింగ్‌ బిల్లులు, హైదరాబాద్‌ మెట్రోతో పాటు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కేబినెట్‌ తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న రెండు డీఏల అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. డీఏల విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పీఆర్సీ నివేదికతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్‌...