స్థానిక ఎన్నికల డిమాండ్లపై.. ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 30 (మన విశ్వం): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన డిమాండ్ల సాధన కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్ వద్ద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీలు కోదండరాం, రమణ, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తమ డిమాండ్లను నాయకులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ఎన్నికల సంఘం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ధర్నాలో బీఆర్‌ఎస్‌తో పాటు...