నిబద్ధతతో పనిచేసిన సుధాకర్‌ సేవలు అభినందనీయం

నాగిరెడ్డిపేట, సెప్టెంబర్‌ 30 (మన విశ్వం): ప్రభుత్వ ఉద్యోగిగా జెల్ల సుధాకర్‌ అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో భవన్‌లో డిప్యూటీ వాణిజ్య పన్నుల అధికారి సుధాకర్‌ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ బాధ్యతలను నిబద్ధత, నిజాయితీతో నిర్వర్తించిన సుధాకర్‌ను అభినందించారు. ప్రభుత్వ సేవలో సంపాదించిన అనుభవం, ప్రజలతో ఏర్పడిన అనుబంధం చిరకాలం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. పదవీ విరమణ ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, కొత్త జీవితానికి నాంది అని అన్నారు. కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం,...