యూరియా రవాణా భారం ప్రభుత్వమే భరించాలి

నాగిరెడ్డిపేట, సెప్టెంబర్‌ 30 (మన విశ్వం): రైతులపై అదనపు భారం పడకుండా యూరియా రవాణా కిరాయిని గతంలో మాదిరిగానే ప్రభుత్వమే భరించాలని మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) మహాజన సభ తీర్మానించింది. బుధవారం సొసైటీ చైర్మన్‌ దుండిగల్‌ నర్సింలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతుల సమస్యలు, సొసైటీ అభివృద్ధికి సంబంధించి ఐదు తీర్మానాలను ఆమోదించారు. సొసైటీ పరిధిలో క్రాప్‌ లోన్‌ బకాయిలున్న రైతుల ఫసల్‌ బీమా ప్రీమియాన్ని సొసైటీ నుంచే చెల్లించాలని తీర్మానించారు. మాల్తుమ్మెదలో పీఏసీఎస్‌కు సొంత భవనం నిర్మించడంతో పాటు చీనూరు–వాడి మధ్య 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో గోదాం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సొసైటీ పాలకవర్గాన్ని నామినేషన్‌ విధానంలో కాకుండా...