జిల్లాస్థాయి కిసాన్ మేళాలో ప్రజాప్రతినిధులు, ఏఈవోలు
నాగిరెడ్డిపేట, సెప్టెంబరు 30 (మన విశ్వం): జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన జిల్లాస్థాయి కిసాన్ మేళా-2026లో నాగిరెడ్డిపేట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఏఈవోలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన మేళాలో వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రైతులకు ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, పంటల సాగు విధానాలు, ఉద్యాన పంటలపై వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించే పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో మెల్లకుంట తండా సర్పంచ్ రామావత్ బాల్య, జలాల్‌పూర్ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు జమ్మికుంట జీవరత్నం, కాంగ్రెస్...