ఎర్రవల్లి 325లో.. మా భూములూ కలిపేశారు!

హైదరాబాద్‌/సిద్దిపేట, సెప్టెంబర్‌ 29 (మన విశ్వం): సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం మార్కూక్‌ మండలం శివారు వెంకటాపూర్‌ రైతుల భూముల వ్యవహారం ఎర్రవల్లి సర్వే నంబర్‌ 325తో ముడిపడి కొత్త వివాదంగా మారింది. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత తమ గ్రామ భూ రికార్డులు మారిపోయాయని, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఎర్రవల్లి 325లో కలిపేశారని రైతులు ఆరోపించారు. సమగ్ర సర్వే నిర్వహించి ఎవరి భూమి వారికి ఇప్పించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. మంగళవారం సచివాలయంలో రైతులు మంత్రిని కలిసి పాత పాస్‌బుక్కులు, గ్రామ నక్షాతో వినతిపత్రం అందజేశారు. సమస్యపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాత...