92.88 లక్షల మందికి.. ‘సర్‌’ నోటీసులు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 (మన విశ్వం): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 92,88,180 మంది ఓటర్లకు నోటీసులు రూపొందించగా, ఇప్పటివరకు 87,97,580 మందికి అందజేశారు. మరో 4,90,600 మందికి నోటీసులు అందాల్సి ఉంది. ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు, 2002 నాటి జాబితాతో వివరాలు సరిపోలని కేసులే ప్రధానంగా ఈ నోటీసుల పరిధిలో ఉన్నాయి. నోటీసుల పరిష్కార ప్రక్రియలో ఇప్పటివరకు 59,51,696 మంది ఓటర్లకు సంబంధించి విచారణ పూర్తయింది. వీరిలో 46,10,367 మందిని ఈఆర్వో/ఏఈఆర్వో స్థాయిలో తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు క్లియర్‌ చేశారు. అయితే ఈ దశలో క్లియరెన్స్‌ రాని వారి పేర్లు తొలగిపోయినట్లు కాదని...