సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కేటీఆర్‌ వ్యూహం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 (మన విశ్వం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్‌ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల సిట్టింగ్‌ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పార్టీ క్షేత్రస్థాయి కార్యాచరణకు సిద్ధమవుతోంది. సోమవారం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నేతలతో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదే తొలి టార్గెట్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి కొత్త ఓటర్ల జాబితా తయారీ మొదలైన నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడితో ఓటు నమోదు చేయించడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కేటీఆర్‌ సూచించారు....