సింగరేణి లాభాల్లో.. 40 శాతం ఇవ్వాలి!

బెల్లంపల్లి, సెప్టెంబర్ 27 (మన విశ్వం): సింగరేణి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, అందులో 40 శాతం వాటాను కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిమాండ్ చేసింది. శాంతిగని లాంగ్‌వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి టీ. మణిరామ్‌సింగ్ మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా లాభాల వాటాపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 50 మిలియన్ టన్నులు సాధించినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ కార్మికులతో సమానంగా లాభాల వాటా ఇవ్వాలని, కనీస వేతనం నెలకు రూ.26 వేలకు తగ్గకుండా చెల్లించాలని...