ప్రతి పంచాయతీకి.. సొంత భవనం!

రంగారెడ్డి, సెప్టెంబర్‌ 26 (మన విశ్వం): రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తెలిపారు. సొంత భవనాలు లేని 5,118 పంచాయతీలకు రూ.1,000 కోట్లతో నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటికే 3,269 భవనాల పనులు 70 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. మిగిలిన పనులన్నీ ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని 8 వేల గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి రూ.800 కోట్లు మంజూరు...