పట్టభద్రులపై.. గులాబీ గురి! వరంగల్–ఖమ్మం–నల్గొండ నేతలతో కేటీఆర్ కీలక భేటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (మన విశ్వం): వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్‌ఎస్ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలకంగా సమావేశమయ్యారు. ఎన్నికకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఓటరు నమోదు దశ నుంచే క్షేత్రస్థాయిలో పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 28 నుంచి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి ఓటరు జాబితాను కొత్తగా రూపొందిస్తుండటంతో గతంలో ఓటు ఉన్న పట్టభద్రులు కూడా మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఎన్నికల్లో కీలకమని భావిస్తున్న బీఆర్‌ఎస్.. నియోజకవర్గ, మండల స్థాయిలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి...