ఖైరతాబాద్‌పై.. కమలం గురి!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (మన విశ్వం): ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థి ఎంపికతో పాటు క్షేత్రస్థాయి వ్యూహానికి పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్య నేతలతో నిర్వహించిన లంచ్‌ మీట్‌కు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ జి.కిషన్‌రెడ్డి హాజరుకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దానం నాగేందర్‌ అనర్హతతో ఖైరతాబాద్‌ స్థానానికి ఉపఎన్నికకు మార్గం సుగమం కావడంతో బీజేపీ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. రేపు సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కిషన్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఖైరతాబాద్‌లో పార్టీ పరిస్థితి, బూత్‌ల వారీగా బలాబలాలు, ప్రచార వ్యూహం, అభ్యర్థి ఎంపిక తదితర అంశాలు చర్చకు వచ్చే...