నెత్తురోడుతున్న తాడిచర్ల రోడ్లు!
మల్హర్, సెప్టెంబర్ 26 (మన విశ్వం): తాడిచర్లలో బొగ్గు రవాణా చేస్తున్న భారీ టిప్పర్ల రాకపోకలు గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గ్రామ పరిధిలో ఓ పాడి బర్రెపైకి బొగ్గు టిప్పర్ దూసుకెళ్లడంతో దాని కాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో ఏఎంఆర్ బొగ్గు రవాణా వాహనాల వేగం, రహదారుల పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడిచర్ల మీదుగా నిత్యం పెద్ద సంఖ్యలో బొగ్గు టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయని, కొన్ని వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రహదారులు గుంతలమయంగా మారగా, బొగ్గు దుమ్ముతో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించని పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. గతంలోనూ టిప్పర్ల కారణంగా...