9,937 స్కూళ్లకు.. సూర్యుడే కరెంట్‌!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (మన విశ్వం): తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విద్యుత్‌ అవసరాలకు ఇక సూర్యుడే అండగా నిలవనున్నాడు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 9,937 ప్రభుత్వ పాఠశాలలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చేపట్టిన భారీ ప్రాజెక్టు కీలక దశకు చేరింది. 46.7 మెగావాట్ల మొత్తం సామర్థ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు విలువ జీఎస్టీతో కలిపి సుమారు రూ.297.50 కోట్లు. కాంట్రాక్టు సంస్థకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేసింది. పాఠశాలల అవసరాన్ని బట్టి 2 కిలోవాట్లు, 5 కిలోవాట్లు, 10 కిలోవాట్ల సామర్థ్యంతో ఆన్‌గ్రిడ్‌ సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. వర్క్‌ ఆర్డర్‌ జారీ...