మా వల్లే గెలుపు.. ఇప్పుడు మాపైనే పోరా?
మంచిర్యాల, (మన విశ్వం): నాడు ఎంపీ గెలుపు కోసం కలిసి నడిచారు.. నేడు అదే గెలుపును ప్రస్తావిస్తూ మాటల తూటాలు పేలుతున్నాయి. మంచిర్యాల కాంగ్రెస్‌లో కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తాజా వ్యాఖ్యలతో మరింత వేడెక్కాయి. “మా సహాయం లేకుంటే ఎంపీగా గెలిచేవాడా?”, “అందరం కలిసి గెలిపిస్తే ఇప్పుడు మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వర్గంతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల వంశీకృష్ణ బైక్ ర్యాలీ, ఫ్లెక్సీల వివాదం తర్వాత ఇప్పుడు ప్రేమ్‌సాగర్‌రావు ఘాటు వ్యాఖ్యలు తెరపైకి రావడంతో మంచిర్యాల కాంగ్రెస్‌లో వర్గపోరు మరో మలుపు తిరిగింది....