విమానాశ్రయాల్లో.. తెలంగాణ ముద్ర!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22 (మన విశ్వం): వరంగల్‌, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలు తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతీకలుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయాల శిల్ప, వాస్తు కళలను అధ్యయనం చేసి.. వాటి ప్రత్యేకత ప్రతిబింబించేలా విమానాశ్రయాల నిర్మాణ డిజైన్లు ఉండాలని సూచించారు. ఢిల్లీలో నిర్మించే తెలంగాణ భవన్‌కూ ఇదే తరహాలో రాష్ట్ర సాంస్కృతిక ముద్ర ఉండాలని స్పష్టం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో వరంగల్‌, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్‌ నిర్మాణాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మూడు నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను పరిశీలించి పలు మార్పులు సూచించారు. విమానాశ్రయాల నిర్మాణ ప్రాంతాల్లో...