ఓయో గదిలో యువతి మృతి.. మిస్టరీ!
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (మన విశ్వం): మాదాపూర్‌లోని ఓ ఓయో హోటల్ గదిలో విశాఖపట్నానికి చెందిన షారన్ నిఖిత టోప్నో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఆమె ముఖం, తల భాగంలో గాయాలు ఉండటం, బస చేసిన గదిలో రక్తపు మరకలు కనిపించడంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగిందన్న కోణంలో మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిఖిత తన స్నేహితుడు శ్రీనివాస రవితేజతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి మాదాపూర్ సిద్ధిఖీనగర్‌లోని ఓ హోటల్‌లో బస చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమెను అపస్మారక స్థితిలో కొండాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు....