బడికి వెళ్లాలంటే.. ఈ గుంతలు దాటాల్సిందేనా?
కొమరం భీం, సెప్టెంబర్ 22 (మన విశ్వం): చేతిలో పుస్తకాల బ్యాగులు.. బడికి వెళ్లాలన్న తపన.. కానీ దారి మాత్రం గుంతలమయం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం లోడ్‌పల్లి వద్ద రహదారి దుస్థితిపై విద్యార్థులు రోడ్డెక్కారు. పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వర్షాలతో రహదారి మరింత దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందిగా మారిందని విద్యార్థులు వాపోయారు. ప్రతిరోజూ ఇదే మార్గంలో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, గుంతల కారణంగా ప్రయాణం కష్టంగా మారిందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనలో స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబుకు వ్యతిరేకంగా...