తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న అరెస్ట్

వరంగల్‌, సెప్టెంబర్‌ 21 (మన విశ్వం): గీసుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గరీబ్‌నగర్‌లో జరిగిన ఎలుబాక ప్రసాద్‌ (31) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రసాద్‌ను అతని అన్న ఎలుబాక ప్రవీణ్‌ (33) కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 19 రాత్రి సుమారు 9.30 గంటలకు గరీబ్‌నగర్‌లోని అద్దె ఇంట్లో ప్రసాద్‌ కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఛాతి, వీపు, భుజం ప్రాంతాల్లో తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లి ఎలుబాక సుజాత ఫిర్యాదుతో గీసుగొండ పోలీసులు హత్య...