లంచం కేసులో సీఐ.. ఎస్సై అరెస్ట్‌!

లంచం వ్యవహారంలో కీసర పోలీస్‌స్టేషన్‌ సీఐ, ఎస్సై అరెస్టు కావడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఓ కేసులో నిందితుడికి బెయిల్‌ విషయంలో సహకరించేందుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. రూ.5 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఎస్సైని పట్టుకున్నారు. అనంతరం సీఐని కూడా అరెస్ట్‌ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఓ కేసులో నిందితుడికి బెయిల్‌ విషయంలో సహకరించేందుకు సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణ. అంతేకాకుండా కొన్నిరోజులుగా బాధితుడితో బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌ తెప్పిస్తూ ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. వేధింపులు భరించలేక బాధితుడు చివరకు ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో...