రోడ్డుపాలవుతున్న ఆర్టీసీ టికెట్‌ రోల్స్‌!

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌ 15 (మన విశ్వం): ప్రయాణికుడికి టికెట్‌ ఇచ్చేందుకు కండక్టర్‌ చేతిలో ఉండాల్సిన ఆర్టీసీ టికెట్‌ పేపర్‌ రోల్స్‌.. రోడ్లపై కనిపిస్తుండటం ఆదిలాబాద్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బస్సుల్లో రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన ఈ సామగ్రి నిర్మల్‌ ఘాట్‌ రోడ్డు, నేరేడిగొండ టోల్‌ప్లాజా, బోథ్‌ ఎక్స్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో పడివున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్‌ పేపర్‌ అవసరం కూడా పెరుగుతుంది. అవసరాన్ని బట్టి డిపోల నుంచి అదనపు రోల్స్‌ను కండక్టర్లకు అందిస్తుంటారు. అలాంటి టికెట్‌ రోల్స్‌ రోడ్లపైకి ఎలా వస్తున్నాయన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒక్కో రోల్‌కు సుమారు రూ.25 వరకు వ్యయం ఉంటుందని సిబ్బంది వర్గాల...