ఖో-ఖోలో శ్రీనిధి గ్లోబల్ స్కూల్ సత్తా!
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 14 (మన విశ్వం): కుత్బుల్లాపూర్ జోనల్ స్థాయి అండర్-14 ఖో-ఖో పోటీల్లో శ్రీనిధి గ్లోబల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. సుమారు 40 జట్లు పాల్గొన్న పోటీల్లో అద్భుత ఆటతీరుతో రాణించి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బాచుపల్లి సమీపంలోని సూర్య గ్లోబల్ స్కూల్ వేదికగా జరిగిన పోటీల్లో శ్రీనిధి విద్యార్థులు వేగం, సమన్వయం, క్రమశిక్షణతో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. చివరి వరకు పట్టుదలతో పోరాడి రన్నర్స్‌అప్‌గా నిలిచారు. విద్యార్థుల విజయంపై పాఠశాల చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ కోమలాదేవి హర్షం వ్యక్తం చేసి వారిని అభినందించారు. విద్యార్థులకు నిరంతరం శిక్షణ అందిస్తూ విజయానికి మార్గనిర్దేశం చేసిన కోచ్ శ్రీకాంత్‌ను ప్రత్యేకంగా...