నర్సు హత్య.. డీఎన్‌ఏతో కీలక మలుపు!

తుక్కుగూడలో 21 ఏళ్ల నర్సుపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు నమోదైన సంచలన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి నుంచి సేకరించిన జీవ నమూనాల్లో లభించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌, అరెస్టయిన నిందితుడు మహ్మద్‌ సనావుల్లా(34) డీఎన్‌ఏతో సరిపోలినట్లు ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించినట్టు పోలీసు వర్గాల సమాచారం. దీంతో ఇప్పటివరకు సాంకేతిక, పరిస్థితుల ఆధారాలతో సాగుతున్న దర్యాప్తుకు కీలక శాస్త్రీయ ఆధారం తోడైనట్లయింది. తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి ఆగస్టు 29న తన గదిలో మృతిచెందిన స్థితిలో కనిపించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సమీపంలో మెకానిక్‌గా పనిచేస్తున్న సనావుల్లాను అరెస్టు చేశారు. బాధితురాలి కదలికలను నిందితుడు కొంతకాలంగా గమనిస్తున్నట్లు పోలీసుల...