ఆరు నెలల గర్భిణిని కడతేర్చిన భర్త!

ఆరు నెలల గర్భిణి భార్యను భర్తే గొంతు నులిమి హత్య చేసిన దారుణ ఘటన అల్వాల్‌లో కలకలం రేపింది. సూర్యనగర్‌లో నివాసముంటున్న శివాని, భర్త పరశురామ్‌ చేతిలో హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఏడాది క్రితమే వీరికి వివాహం కాగా ప్రస్తుతం శివాని ఆరు నెలల గర్భిణి. పోలీసుల సమాచారం ప్రకారం.. ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న పరశురామ్‌ ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్యతో జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో అర్ధరాత్రి ఆమె గొంతు నులిమినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం శివాని బాత్రూంలో జారిపడి మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మృతిపై అనుమానాలు రావడంతో పోలీసులు...