సిర్పూర్‌లో నువ్వా.. నేనా!
కొమురం భీం, సెప్టెంబర్ 12 (మన విశ్వం): సిర్పూర్‌లో రాజకీయం భగ్గుమంటోంది. ఓవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ వర్గం.. మరోవైపు బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గం.. ‘నువ్వా.. నేనా!’ అన్నట్లుగా తలపడుతున్నాయి. మాటకు మాట.. పోస్టుకు పోస్టు.. వీడియోకు వీడియోతో పరస్పరం రాజకీయ అస్త్రాలు సంధించుకుంటుండటంతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. నిన్నటివరకు సోషల్ మీడియా పోస్టులు, విమర్శలు, కౌంటర్లకే పరిమితమైన పోరు ఇప్పుడు పోటాపోటీ ప్రెస్‌మీట్ల వరకు చేరింది. ఒక వర్గం ఆరోపణలు చేస్తే.. మరో వర్గం వెంటనే కౌంటర్‌కు దిగుతోంది. నాయకుల మధ్య మొదలైన మాటల యుద్ధంలో కార్యకర్తలూ రంగంలోకి దిగడంతో రాజకీయ రచ్చ...