ఏఎంఆర్‌పై ఈడీ సోదాలు!

ప్రముఖ మైనింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఏఎంఆర్‌ ఇండియా లిమిటెడ్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. SREI గ్రూప్‌ సంస్థల రుణ లావాదేవీలపై కొనసాగుతున్న మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఏఎంఆర్‌ ఇండియా కార్యాలయంలో కోల్‌కతా ఈడీ యూనిట్‌కు చెందిన బృందాలు ఆర్థిక రికార్డులను పరిశీలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా, చెన్నై, బెంగళూరులోనూ సంబంధిత సంస్థలకు చెందిన ప్రాంతాల్లో తనిఖీలు జరిగినట్లు సమాచారం. SREI Infrastructure Finance Limited, SREI Equipment Finance Limited నుంచి మంజూరైన రుణాలు, వాటి వినియోగం, తిరిగి చెల్లింపులు, సంబంధిత సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు...