రూ.10 వేల లంచం.. తహసీల్దార్‌కు రెండేళ్ల జైలు!

మంచిర్యాల, సెప్టెంబర్‌ 11 (మన విశ్వం): భూమి మ్యుటేషన్‌, పట్టాదారు పాస్‌బుక్‌ జారీ కోసం రూ.10 వేల లంచం తీసుకున్న కేసులో మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తహసీల్దార్‌ అలుగునూరి రోశయ్యకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2013లో నమోదైన ఈ కేసులో దాదాపు 13 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి నామ సంతోష్‌కుమార్‌ గురువారం తీర్పు వెలువరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. సెక్షన్‌ 13(1)(డి) రెడ్‌విత్‌ 13(2) కింద కూడా రెండేళ్ల కఠిన కారాగార...