22ఏకు సూత్రధారి రేవంత్‌.. పాత్రధారి పొంగులేటి!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (మన విశ్వం): 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘22ఏ స్కామ్‌కు రేవంత్‌ సూత్రధారి అయితే.. పొంగులేటి పాత్రధారి’’ అని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన 22ఏ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల తప్పిదంతోనో, ప్రభుత్వ పొరపాటుతోనో భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లలేదని, నేరపూరిత ఆలోచనతోనే కోటి ఎకరాలను 22ఏ పరిధిలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. ‘‘వీరప్పన్‌ అటవీశాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో.. బ్లాక్‌మెయిలర్‌ సీఎం అయితే ఎలా ఉంటుందో.. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉంది’’ అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు....