వాన జాడేది.. రైతన్న గట్టెక్కేదెలా?

వానాకాలం నడుస్తున్నా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 42 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 33 జిల్లాల్లో ఏకంగా 29 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడం ఖరీఫ్‌ రైతుల్లో ఆందోళన పెంచుతోంది. ఆగస్టులో రాష్ట్రంలో సాధారణంగా 226.1 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 130.2 మి.మీ.కే పరిమితమైంది. మొత్తం రుతుపవన కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నా వర్షపాతం లోటు సుమారు 23 శాతంగా ఉంది. జిల్లాల వారీగా నల్గొండలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అక్కడ ఏకంగా 77 శాతం లోటు నమోదవగా.. ఆదిలాబాద్‌లో 74 శాతం, నిర్మల్‌లో 64 శాతం, పెద్దపల్లిలో 61...