ఫ్యూచర్ సిటీ.. ఫ్యామిలీ కోసమేనా?
‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులకు మేలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులు తెస్తున్నామంటూ సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. ఫోర్త్ సిటీలో టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు కేటాయించిన భూములను మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు కట్టబెట్టారు. ఇదేనా ప్రజాపాలన?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో ‘ది గ్రేట్ అనుముల రేవంత్‌రెడ్డి.. ది గ్రేట్ పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్‌రెడ్డితో రూ.వెయ్యి...