బీఆర్ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయింది!

మూడు రోజుల అసెంబ్లీ పరిణామాలపై తాను చేయించిన ఫ్లాష్‌ సర్వేలో బీఆర్ఎస్‌ గ్రాఫ్‌ బాగా పడిపోయినట్లు తేలిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు ప్రజాదరణ పెరిగిందని, సభలో మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు సమన్వయంతో బాగా పనిచేశారని ప్రశంసించినట్లు తెలిసింది. ఇదే దూకుడును కొనసాగిస్తూ ప్రతిపక్ష ఆరోపణలను వాస్తవాలతో తిప్పికొట్టాలని సూచించారు. గురువారం జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీ పరిణామాలు, 22ఏ భూముల వివాదం, ప్రతిపక్ష వ్యూహం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు 22ఏపై అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కోటి ఎకరాల ప్రచారంపై...