బీసీల లెక్కకు.. ప్రత్యేక కాలమ్ పెట్టాలి!
దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీలకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయిని భరత్ డిమాండ్ చేశారు. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసేందుకు జనగణనలో ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని, ఇందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీల జనాభా ఎంత?.. ఏ కులం ఎంతమంది ఉన్నారు?.. వారి సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై దేశవ్యాప్తంగా సమగ్రమైన అధికారిక గణాంకాలు అవసరమని నాయిని భరత్ పేర్కొన్నారు. కచ్చితమైన లెక్కలు లేకుండా బీసీలకు జనాభాకు అనుగుణంగా సంక్షేమ ఫలాలు, విద్య–ఉపాధి అవకాశాలు అందించడం సాధ్యం...