హైదరాబాద్‌కు మరో గ్లోబల్ టెక్ బూస్ట్!
ప్రపంచ ఔషధ, జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ప్రపంచ ప్రఖ్యాత బయోఫార్మా సంస్థ ఎంఎస్‌డీ ఏర్పాటు చేసిన నూతన సాంకేతిక కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు. హైటెక్ సిటీలో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం డిజిటల్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు, ఇంజినీరింగ్ రంగాల్లో సంస్థ ప్రపంచ కార్యకలాపాలకు కీలకంగా పనిచేయనుంది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణను కేవలం ఔషధ తయారీ కేంద్రంగా కాకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతకు ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2...