పేకాట అడ్డాపై పోలీసుల దాడి!
నల్లబెల్లి, సెప్టెంబర్ 10 (మన విశ్వం): వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నందిగామ గ్రామంలో కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు గురువారం సాయంత్రం పెట్రోలింగ్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.4,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లబెల్లి ఎస్‌ఐ సాయి ప్రసన్నకుమార్ తెలిపారు. మండలంలో పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.