నకిలీ తాకట్టు పత్రంతో గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీకి టోకరా

బంగారం తాకట్టు పెట్టకుండానే.. పెట్టినట్లు నకిలీ పత్రం సృష్టించి ఓ గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీకి రూ.59.30 లక్షల టోకరా వేశారు. ఈ కేసులో శ్రిమాన్‌ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ యూనియన్‌ చైర్మన్‌, సీఈఓ ఎలిమి సంతోష్‌ (37), వ్యాపారి వడ్డేపల్లి రంజిత్‌ (39)ను హనుమకొండ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ మచ్చ శివకుమార్‌ తెలిపారు. పోలీసుల విచారణ ప్రకారం.. నిందితులు ఇద్దరూ కలిసి కుట్ర పన్ని రంజిత్‌కు చెందిన సుమారు 640 గ్రాముల బంగారం శ్రిమాన్‌ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ యూనియన్‌లో తాకట్టు ఉన్నట్లు నకిలీ ప్లెడ్జ్‌ రసీదు సృష్టించారు. దానిని నిజమైన పత్రంగా గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధిని నమ్మించారు. బంగారాన్ని ప్రత్యక్షంగా పరిశీలించకుండానే ఆ సంస్థ...