అంబులెన్స్ మాఫియా దోపిడీపై చర్యలు తీసుకోండి
మంచిర్యాల, సెప్టెంబర్ 10 (మన విశ్వం): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు కొనసాగుతున్న ‘అంబులెన్స్ మాఫియా’ ఆగడాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ మంచిర్యాల శాఖ గురువారం మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇగ్గడి భాస్కర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల అక్రమ మాఫియా తరహా విధానాలను, ముఖ్యంగా ఏకపక్ష ‘పాయింట్ సిస్టమ్’ గురించి హెచ్‌ఆర్‌డీఏ బృందం డీసీపీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ సిండికేట్ కింద ప్రైవేట్ నిర్వాహకులు అత్యవసర రవాణాను గుత్తాధిపత్యం చేసి, అత్యంత ప్రమాదకరమైన, నిస్సహాయ వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాల నుంచి అధికంగా డబ్బులు వసూలు...