సీఎంఆర్‌ఎఫ్ చెక్కుకూ.. లంచం!
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (మన విశ్వం): పేదలకు వైద్య అవసరాల్లో అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కు విషయంలోనూ లంచం డిమాండ్ చేసిన వ్యవహారం వెలుగుచూసింది. రూ.2 లక్షల వైద్య సాయం చెక్కు జారీ చేయడంతో పాటు మిగిలిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఇద్దరు ఉద్యోగులను తెలంగాణ ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ వివరాల ప్రకారం.. తెలంగాణ సచివాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అందనేశి రాఘవేందర్, బషీర్‌బాగ్‌లోని పరిశ్రమ భవన్‌లో టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మేది వినోద్ కలిసి ఫిర్యాదుదారుడి సీఎంఆర్‌ఎఫ్ వైద్య రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ప్రాసెస్...