రిజిస్ట్రేషన్లపై.. అవినీతి ముద్ర!
ప్రజల ఆస్తులకు చట్టబద్ధత కల్పించాల్సిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. 2024 జనవరి 1 నుంచి 2026 సెప్టెంబర్ 8 వరకు బహిరంగంగా అందుబాటులో ఉన్న కేసులను పేర్లు, తేదీలు, కార్యాలయాల వారీగా పరిశీలిస్తే కనీసం 16 మంది సబ్ రిజిస్ట్రార్, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారులు లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లు, భూములకు సంబంధించిన కేసుల్లో చిక్కినట్లు తెలుస్తోంది. వీరిలో 2024లో ఏడుగురు, 2025లో ఐదుగురు, 2026 సెప్టెంబర్ 8 నాటికి మరో నలుగురు ఉన్నారు. 2024లో దూద్‌బౌలి ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ అమైర్ ఫరాజ్ రూ.2 లక్షల లంచం కేసులో చిక్కగా.. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్...