మిల్లర్ల గోడు.. సర్కారు లెక్క!

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు–మిల్లింగ్‌ వ్యవస్థలో కీలక భాగస్వాములైన ప్రభుత్వం, రైస్‌ మిల్లర్ల మధ్య పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? పెరిగిన నిర్వహణ వ్యయం, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు, సీఎంఆర్‌ నిబంధనలు, పెనాల్టీలు, విద్యుత్‌ ఛార్జీలు, బ్యాంకు రుణాలతో పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని తెలంగాణ రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు రైతుల నుంచి ప్రజాధనంతో కొనుగోలు చేసి మిల్లులకు అప్పగించే ధాన్యానికి ప్రతి గింజకూ లెక్క ఉండాలని, సీఎంఆర్‌ను నిర్ణీత గడువులో అప్పగించాల్సిందేనన్నది ప్రభుత్వ యంత్రాంగం వాదన. ఇరువర్గాల వాదనల్లోనూ విస్మరించలేని అంశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మిల్లర్లను చర్చలకు పిలిచి సమస్యలవారీగా పరిష్కారం చూపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది....