గాంధీచౌక్‌లో ఆన్‌లైన్ మట్కా!
కొమరం భీమ్, సెప్టెంబర్ 10 (మన విశ్వం): కాగజ్‌నగర్ పట్టణంలోని గాంధీచౌక్ వద్ద ఆన్‌లైన్ మట్కాకు పాల్పడుతున్న ఎండీ సమీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్ సీఐ ప్రేమ్‌కుమార్ ఆదేశాలతో ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ సిబ్బందితో దాడి చేసి అతడిని పట్టుకున్నారు. సమీర్ వద్ద నుంచి రూ.6,500 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మట్కా, జూదం సహా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.